BHAGAVATA KADHA-3    Chapters   

విపరీత ధర్మములఁగని ధర్మజుఁడు చింతించుట

47

శ్లో|| పశ్యోతో%్‌పాతాన్‌ పరవ్యాఘ్ర - దివ్యాన్‌ భౌమాన్‌ సదైహికాన్‌ 7

దారుణాన్‌ శంసతో7 దూరాద్భయం నో బుద్ధి మోహనమ్‌ ||

- భాగ. 1స్కం. 14 అ. 10 శ్లో.

''ధర్మజుఁడు భీమునిం జూచి యిట్లనియె :-

(సీ|| ఒక కాలమునఁ బండు నోషధిచయము వే

ఱొకకాలమునఁ బండకుండు నండ్రు

క్రోధంబు లోభంబు క్రూరత బొంకును

దీపింప నరులు వర్తింతు రండ్రు

వ్యవహారములు మహావ్యాజ యుక్తములండ్రు

సఖ్యంబు వంచనా సహిత మండ్రు

మగలతో నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు

సుతులఁ దండ్రులఁ దెగఁజూతు రండ్రు

గీ|| గురులు శిష్యులు దూషించి కూడ రండ్రు

శాస్త్రమార్గము లెవ్వియు సాగ వండ్రు

న్యాయపద్ధతి బుధలైన నదవ రండ్రు

కాలగతి నింతయై వచ్చెఁ గంటె నేఁడు. )

క || మానసము గలఁగు చున్నది.

మానవు బహు దుర్నిమిత్త మర్యాదలు స

న్మానవ దేహక్రీడలు

మాన విచారిపం నోవు మాధవుఁడకటాః ''

- శ్రమదాంధ్ర భాగవతము.

ఛప్పయ

కమేఁ యుధిష్ఠిర, భీమ! భయానకర కాల భయోహై|

ఆయో అర్జున నహీఁ, ద్వారికా మాహ్రి గయో హై ||

భ##యే ధర్మ విపరీత రీతి కుల కీ సబ త్యాగేఁ |

జాఇఁపుత్ర పరలోక పితా మాతా కే ఆగేఁ ||

పితా పుత్ర, భా ఈ సగే, పతి పత్నీ మేఁ కలహ నిత |

అసగున నిత నూతన నిరకి, చంచల హోవే మోర చిత ||

అర్థము

ధర్మరాజు భీమునితో నిట్లనెను:- ''భీమా! భయానక మగు కాల మాసన్నమైనది. అర్జునుడు ద్వారకకు వెళ్లి చాల దినములైనది. ఇంతవఱకు రానేలేదు. ధర్మమంతయు విపరీతమైనది. వర్ణాశ్రమ ధర్మము లన్నియు పాడైనవి. పుత్రులు తల్లిదండ్రుడు చావకమునుపే చచ్చిపోవుచున్నారు. పితా పుత్రులకును, అన్నదమ్ములకును, భార్యాభర్తలకును పరస్పరము కలహమేర్పడు చున్నది. ఇట్టి విపరీత దుర్గుణములను జూడఁగా నామనస్సు చాల చంచల మగుచున్నది.

ఈ ప్రపంచమంతయు పరివర్తన శీలము కలది. దీనిలోఁ గనఁబడు వస్తువులన్నియు నారూపమున సత్యములు కావు. అన్నియు నసారములు, నాశవంతములు, క్షణభంగురములు. వీటి అన్నిటిలో సమానరూపమున వ్యాప్తమగు భగవత్‌ సత్తా సత్యమైనది. రోగ, శోక, చింతా వ్యాకులతకు నిలయమగు నీ సంసారరచనము ప్రబువేల చేసినాఁడు? అందఱు దీనికొక్కటే జవాబిచ్చినారు. క్రీడకొఱకు, వినోదార్థము, చిత్త సంతోషము కొఱకు, ఇతి మనోరంజనము కొఱకే యగునెడల నీదైత్ర, దానవ, అధర్మ, పాపాదుల భీభత్సదృశ్యమెందులకు? ఇదికూడ మనోరంజనమేనా? బాగుగా లడ్డు, జిలేబి మొదలగు వస్తువులు తిని ముఖము మొత్తినప్పునడు, పచ్చడి, ఆవకాయ నంజుకొనిన రుచిమాఱి నోటికనుకూలముగ నుండును. ప్రభువునకుఁ బ్రవృత్తముకాక ధర్మము యిష్టములేదు. అదర్మము యిష్టములేదు. ఈ రెండును బ్రభువునకంగములు, ధర్మము ఉత్తమాంగమగు హృదయము. అధర్మము పృష్టభాగము; కాని శరీర రక్షణకు ఉత్తమాధమఅంగములన్నియు నావశ్యకములే. సర్వదా అనహ్యమగు దుర్గంధము వెడలు మలద్వారము ఉత్తమమైనది కాదనుకొని దీనిని శరీరమునుండి వేఱుచేయుట దుర్లభము. అవి లేకుండిన శరీరమే నిలువదు. వలాధారముననే యీ శరీరరము నిలిచినది. అట్లే యీ ప్రపంపంచములో ధర్మాధర్మములు రెండు నెల్లప్పుడుండనే యుండును. ఉండఁగలవు. కాని ధర్మము గ్రాహ్యమైనది. అధర్మము త్యాజ్యము.

కాలరూపుఁడగు ప్రభువు సదా క్షణక్షణము తన నిత్య నూతన రూపమును ధరించుచుండును. ఆతఁడెన్నఁడు నొక స్థితిలో నుండఁడు. ఆతని గతి దుర్నివార్యము. దాని నెవరును దాఁటజాలరు. ఇవ్వేళ ఆదివారముకాక శనివారము కావలె ననిన నది యసంభవము నీ వెంత ప్రయత్నించినను అమావస్యనాఁడు పూర్ణిమ కాఁజాలదు. ఆ దినమున నీవు లక్ష ప్రయత్నములు చేసినను పూర్ణచంద్రునిఁజూపింపలేవు. జ్యేష్టమాసములో మాఘమాసములోని చలని సర్వత్ర నీవు చూపింప జాలవు. వ్యక్తిగతముగ నీవు నీ యింటిలో శీతలములగు హిమ ఖండముల నుంచుకొని నీ ఒక్క గృహమును జల్లగఁ జేసికొనఁగలుగుదువు. అన్నిటికిని కాలమనునది కలదు. కృతయుగము తర్వాతఁ ద్రేతాయుగము, త్రేతాయుగము తర్వాత ద్వాపర యుగము, ద్వాపరము తర్వాత కలియుగము వచ్చుచునే యుండును. దాని నెవరును గాదనఁజాలరు. ఇది శ్రీహరి విధానము. దానిని నావారించుట మానవీయశక్తి కతీతము. తమ యహంకారవశమునఁ గటువాక్యములు పలుకు బంధువులు జాలి పడఁదగినవారు. నేనా కార్యము చేయుదును, ఈ కార్యము చేయుదును, ఈ నియమము లేర్పఱతును, ఆ నియమము లేర్పఱతును, అని అనుచుందురు. నిజముగఁ జూచిన నియమము లేర్పఱచుట మనకేమి యధికార మున్నది? రామకృష్ణాద్యవతారములే లోక మర్యాదను నిలుపుటకై కాలపక్వము కాఁగానే శిథిలమైపోఁగా, నీ వంటి యల్పుల కేమిలెక్క? కాని వారికికూడ తప్పలేదు.

పాండవులు సుఖముగ రాజ్యము చేయుచుండిరి. వారు రాజ్యము చేయుచుండగా ముప్పదియాఱు వత్సరములు గడచినవి. వారు చాల వ్యవహారిక వ్యాపారములలో మునిఁగి యుండుటచేఁ గాలమును మఱచిరి. కాని అప్రమత్తమగు కాలము సదా వ్రేళ్ల మీద లెక్క పెట్టుకొనుచు శీఘ్రముగఁ బోవుచుండుటచే దినములు చాల జరిగిపోవుచుండెను అర్జునుడు భగవంతున కభిన్నహృదయుఁడు. జపము చేయుచుండిన మేరుపూస చేతికి తగులఁగా నర్జునుఁడు రోజులిట్లే గడచుచున్నవని గ్రహించి ధర్మరాజుతో నిట్లు ప్రార్థించెను:- ''మహారాజా! చిరకాలము నుండి శ్యామసుందరుని క్షేమసమాచారములు తెలియుటలేదు. నామనస్సులో నేవియో వివిధ సందేహములు కలుగుచున్నవి. చిత్తములో నేదో యనిష్ట స్పృహ కలుగుచున్నది. మీయాజ్ఞ యగునెడల శ్యాసుందరుని సమాచారమును దెలిసికొని వచ్చెదను. నామనస్సు శ్రీకృష్ణ చరణసరోజ దర్శనము కొఱకు తహతహలాడు చున్నది.''

ధర్మరాజు కోరికయు నిదియే. ఆతఁడుగూడ వాసుదేవుని విచిత్ర లీలలను దెలిసికొనఁగోరు చుండెను. ఈసారి యెట్టి లీలఁ జూపఁదలఁచినాఁడో తెలిసికొనవలసి యుండెను.

అర్జునుడి వాక్యములను విని ధర్మరాజు ఆజ్ఞనొసంగుచు నిట్లనెను:- ''అర్జునా! నీవును నామనస్సులోని విషయమునే పలికినావు. నేనుగూడ దేవకీనందనుని సమాచారమును వినుట కుత్సహించుచున్నాను. నిన్నుఁ బంపవలయుననియే యున్నది కాని భ్రాతృస్నేహవశమున నిన్ను నాకండ్ల కెదుటలేకుండఁ జేయుటకు నా మనస్సొప్పుట లేదు. ఇప్పుడు నీవే అట్టి ప్రస్తావమును గావించితివి కావున నీవు తప్పక వెళ్లి, అచ్చటి సమాచారమును దెలిసికొని త్వరగాఁ దిరిగి రమ్ము. తమ్ముడా! అచ్చట ఆలస్యము చేయవలదు. నీవు భగవంతుని దగ్గఱకుఁ బోఁగానే మమ్ములను మఱచియే పోవుదువు. అట్లు మఱచి పోరాదు. వెళ్లిరమ్ము'' ఈ విధముగా ధర్మరాజు ఆజ్ఞనుబొంది తనవారందఱకడ ననుమతినిఁగొని, అందఱను బ్రేమతోఁ గలిసికొని, కొద్దిగా సేనను గొని కుంతీనందనుఁడగు నర్జునుఁడు ద్వారకకు వెడలెను. ఆతని కొఱకు హస్తినాపురములోఁ బ్రతిదినమును బ్రతీక్షించుటయే. కాని యేడుమాసము లైనప్పటికిని అర్జునుడు రానేలేదు. ఇంతలోనే విదురుఁడు వచ్చి గాంధారీ ధృతరాష్ట్రులను గొనిపోయెను. నారదుఁడు వచ్చి జ్ఞానోపదేశమునుజేసి వెడలిపోయేను.

ధర్మరాజు చిత్తమిప్పుడు కొంచెము చంచలమై పోయెను. ఆతఁడిదివఱకెన్నఁడును జూడనట్టి ధర్మవిపరీతములను గాంచెను. ఇదివఱ కెన్నఁడును గలుగని యుత్పాతములు కలిగినవి. రాఁగూడని యీ సంఘటనములను గాంచి యాతఁడు మిక్కిలి చింతించెను. ఒకానొక దినమున నాతఁడు తన ముగ్గురు తమ్ములకు, ఋషులను, మునులను గాంచి తన చింతాకారణమును దెలిపెను.

తమ అన్న యిట్లు చింతామనస్కుఁడై యుండుటను గాంచి తమ్ములందఱిట్లనిరి:- ''ప్రభూ! మీ రింతగాఁజింతించు చుంటిరేల? సంసారములో సుఖ దుఃఖములు, శుభాశుభములు, కలుగుచునే యుండును.''

ధర్మరాజత్యంత గంభీరుఁడై యిట్లు చెప్పఁదొడఁగెను:- ''సోదరులారా! మీ కింకను దెలియదాయేమి? ఇప్పుడు ఘోరమగు కాలము రానున్నది. ఇట్టి లక్షణములు నాకు ప్రత్యక్షముగ గోచరించుచున్నవి. ఇప్పుడు కలియుగము వచ్చినదో లేక కొద్దికాలములో రానున్నదో యని తోఁచుచున్నది. స్వప్నములో నైనను రాఁగూడనట్టి విషయములు జరుగుచున్నవి. పితా పుత్రులకును, అన్నదమ్ములకును, బంధువులకును, భార్యా భర్తలకును ఎక్కడ చూచినను మనోమాలిన్య లక్షణములు కనఁబడుచున్నది. ప్రజలలో లోభప్రవృత్తి అతిశయించినది. అధర్మబంధువగు దుష్ట కలికాలము నా రాజ్యములోఁ బ్రవేశించినదని తోఁచుచున్నది.''

తమ్ములిట్లనిరి:- ''ప్రభూ! మీ కెట్లు తెలిసినది? మీరు మూర్తిమంతమగు ధర్మస్వరూపులు. మీ యాజ్ఞలేనిది మీ రాజ్యములోఁ బ్రవేశించుట కీ కలికి సాహసమెక్కటిడి?''

ధర్మరాజు దీనతతో నిట్లనెను:- ''సోదరులారా! దుర్నివారమగుఁగాలమును దాఁట శ్రీకృష్ణునకు తప్ప యింకెవరి కిని సామర్థ్యములేదు. లెక్క ప్రకారము కలియుగ మిదివరకే వచ్చియున్నప్పటికి శ్రీకృష్ణపదాంకిత మగు నీ భూమిమీఁదకుఁ గలి యెట్లు పాదప్రక్షేపము కావింపఁగలదు? కావునఁ గలి తన బ్రభావమును జూపఁజాలదు. ప్రజలలో స్వాభావికముగ నున్న ధర్మప్రవృత్తి మారపోవుచుండుటను గాంచుచున్నాను. కాల గతి వికరాళముగ నున్నది. ఋతుధర్మములు విపరీతములైనవి. వర్షకాలములో వర్షములేదు. వర్షమనవసరము లేనప్పుడు పంట నాశనము చేయుటకు విపరీత వర్షమలు కురియుచున్నవి. ప్రజలు క్రోధము కలవారుగను, లోబులుగను, వాగాడంబరము కలవారైరి. ఏదియో సందుచూచుకొని కలియుగము భూమిమీఁదకుఁ బ్రవేశించినట్లున్నది.''

శ్రీకృష్ణుఁడిచ్చట నుండఁగా నా దగ్గఱ కొక యభియోగము వచ్చియుండెను. ఒకవ్యక్తి తనపూర్వుల యింటి నింకొక వ్యక్తి తనచేతులారా అమ్ముకొనెను. కొన్నవాఁడు క్రొత్తయిల్లు కట్టుకొనుటకు దానికిఁబునాదులు త్రవ్వుచుండెను. పునాదులలో స్వర్ణవరహాల లంకెబిందెలు దొఱకెను. ఆయింటిని గొనినవాడా వరహాలనుగొని యింటిని అమ్మినవానివద్దకుఁబోయి యిట్లనెను? ''సోదరా! నీ వమ్మినభవనములో వరహాలబిందె దొఱికినది దీనినిఁ దీసికొనువు.''

ఆ వరహాలబిందెను గాంచి పామును జూచిన భయపడినట్లు భయపడి, దానిని దాఁకకమే అమ్మిన వాడిట్లనెను:- ''మహాను భావా! ఏమిది? ఇట్ల ధర్మముగ మాటలాడుచున్నారు? నేను నీకు గృహమును విక్రయించినప్పుడు ఆయావరణములో వరహాలు దొఱకనిండు వట్టి గుల్ల పెంకులు దొఱకనిండు అన్నియు నీవే. నేనీ వరహాలను దీసికొనఁజాలను. నీవే వాటి ననుభవింపుము.''

ఇది విన యాకొన్నవ్యక్తి యిట్లనెను:- ''సోదరా! నీవు నన్ను లోభ##పెట్టి నాపరలోకమును బాడుచేయకుము. నాకు నీవు గృహమునమ్మితివా యీవరహాలనా? వరహాలను మీ పూర్వులు ప్రాతిపెట్టినారు. ఆసంగతి నీకు తెలియలేదు. నీకు తెలిసియేయుండిన నీవీ స్వల్ప వెలకు దీనిని నాకమ్మము. నేనిచ్చిన ద్రవ్యము భూమికి, యింటికిగాని వరహాలకు కాదుకదా! కావున నాస్వర్ణముద్రలపై నాకే యధికారమును లేదు. నేను వీటిని గైకొని పాపిని గాఁదలఁపు లేదు.''

అంత విక్రయించినవా డిట్లనెను:- ''నేను భూమి నమ్మితిని. దానిఁమీద నాకుఁగాని నాపూర్వులకుఁగాని అధికారము లేదు. ఒకవేళ నా భూమిలోనుండి తేళ్ళు బయలుదేఱి వచ్చిన వాటిని నాయింట వదలిపెట్టెదవాయేమి? మాపూర్వులు దయ్యాలై అక్కడుండిన నాదయ్యముల నాయింటికి పంపెదవా యేమి? ఇంటిలోని వస్తువుల నిర్దేశించి నేను నీకు అమ్మలేదు. ఇంటిని మొత్తమునమ్మితిని. దానిలో నేమి దొఱకినను నీవియే?''

ఈ విధముగ వారిద్దరికి వాదవివాదము జరిగినది. ఆ వరహాలబిందె నెవరును దీసికొని పోలేదు. వివాదము పెరిగి పెరిగి నాదగ్గరకు వచ్చిరి. ఇద్దరును వారివారి వాదముల పుష్టికై ప్రమాణముల నొసంగిరి. అట్టియెడ నేమి నిర్ణయము చేయవలయునో తెలియక కింకర్తవ్యతా విమూఢుఁడనై యుంటిని. నే నేమియు నిశ్చయము చేయలేనిస్థితిలో నుండి శ్రీకృష్ణభగవాను నిట్లడిగితిని:- ''ప్రభూ! దీనికేమి తీర్పు చెప్పుదును? ఈ వరహాల బిందె నెవరికీయవలెను?''

నా మాటలను విని వాసుదేవుడు నవ్వి యిట్లనెను:- ''ధర్మరాజా! నీవు దీని నెవరికి నీయవలదు. దీనిని నీదగ్గనే అనామతుగా నుంచుము. కొంతకాలమైనతర్వాతఁ గలియుగము రాఁగలదు. అప్పుడు వీరి మనస్సులలో లోభము పుట్టఁగలదు. అప్పుడెవరువచ్చి యడిగిన వారికిమ్ము.''

శ్రీకృష్ణుని సలహాప్రకారము వారిద్దరితో నే నిట్లంటిని:- ''మంచిది. మీరిద్దరు వెళ్లిపొండు. ఇది అనామతుగా నాదగ్గర నుండఁగలదు. మీరాలోచించుకొని మరల నావద్దకు రండు ఇది ఎవరిదిగా నిర్ణయించుకొందురో వారికిచ్చెదను.'' ఇది వని వారిద్దరు చాల సంతోషమున వారి నెత్తిమీఁది బరువు దించి నట్లుండి వెళ్లిపోయిరి.

నిన్నటి దినమున వారద్దరు నాదగ్గఱకు కలహించుచు వచ్చి యిద్దరిట్లనిరి:- ''వరహాల బిందె నాదనిన నాదన మొదలిడిరి, ఇంతే కాదు వారిద్దరును విధాన విశారదులను (న్యాయవాదులను) తమ తమ పక్షములఁ బ్రమాణములను జూపి వాదించుటకు తమవెంటఁగొనవచ్చిరి. ఈ మూలమున నేను కలియుగము వచ్చినదని తెలిసికొంటిని.''

నా సేవకులు సేవించుటలోఁబ్రమాదపడుచుండిరి. ఒక దినమున నేను ప్రధాన న్యాయాధీశుని బిలిచి యిట్లంటిని:- ''ఇప్పుడు నీదగ్గఱ కెట్టి యభియోగములు వచ్చుచున్నవి?''

ఆతఁడిట్లనెను:- ''ప్రభూ! అభియోగములు చాల వచ్చుచున్నవి. దానిలోఁగొందఱు అబద్ధములుకూడ మాట్లాడుచున్నారు.''

నేను వ్యగ్రతతో నిట్లంటిని:- ''అబద్ధ మనిన నాకు తలనొప్పి. శ్రీకృష్ణుని యాజ్ఞచే నొకసారి అర్థాసత్యమును బలికితిని. దాని మూలమున నాకిప్పటి వఱకు మనస్సులో బాధ కలుగుచునే యున్నది. నీవభియోగము లన్నిఁటిని వ్రాయుచుండుము.''

న్యాయాధీశుఁడిట్లనెను:- ''ప్రభూ! పాపముల లెక్క వ్రాయుట కలియుగ చిహ్నము. మీరిట్టి యాజ్ఞ యెందుల కొసంగుచున్నారు?''

నే నిట్లంటిని:- ''ఏమైనఁగానిమ్ము. ఆలెక్కను నేను జూడవలసియున్నది.''

ఆతఁడు నా యాజ్ఞచే లెక్కలు వ్రాయుట నారంభించెను. ఒక్కరో, యిద్దరో న్యాయాధీశులుండిరి. ఇప్పుడు వందల కొలఁది యున్నప్పటికి వ్యాజ్యములు తీర్పగుటలేదున ఒక దినమున నేనా లెక్కను జూచితిని. కొన్ని వ్యాజ్యములు నాకు నమ్మకమే లేనట్టివి కలవు. నేనువాది ప్రతివాదులను బిలిచి యిట్లంటిని:- ''ఏమయ్య! మీ రిట్టి పాపములు చేయుచుంటిరా?'' వారు స్పష్టముగ నిట్టనిరి:- ''లేదు, మహారాజా! మే మవి చేయనేలేదు.'' నేను న్యాయాధీశునితో నిట్లంమటిని:- ''వీరట్లు చేయలేదనుచున్నారు. ఈ యభియోగము నెట్లు వ్రాసితివి?'' ఆతఁడిట్లనెను:- ''ప్రభూ! వీరిని నే నడిగియే వ్రాసితిని, ఇప్పుడు వీరు మీ సమక్షమున నసత్యము పలుకుచున్నారు.'' అప్పుడు నేనిట్లంటిని:- ''మంచిది. అందఱిచేత సంతకములను దీసికొనుము. సాక్షుల సంతకములనుగూడ తీసికొనుము.''

నా మాటలనువిని న్యాయాధీశుఁడిట్లనెను:- ''ప్రభూ! మీరిట్టి యాజ్ఞ నీయకుఁడు ప్రతి విషయమునకు సంతకము తీసికొనుట ప్రత్యక్షముగ నవిశ్వాసమును బ్రకటించులయన్నమాట. అవిశ్వాసము కలహములకుమూలము.'' నేనిట్లంటిని:- 'వీఁడిట్లు చెప్పినాఁడని మన కెట్లు గుర్తు? నీ వందఱచేత సంతకములుచేయించుకొనవలయును.'' అప్పటినుండి వ్యాజ్యములను సంతకముతో లెక్కవ్యాయఁబడుచుండెను. వీనిలోఁ నేఁడెచ్చట చూచిననుకలియుగలక్షణములు కనఁబడుచున్నవి.

నా కర్మచారుల, అధికారులు ఇదివఱకు వారి కర్తవ్యమును దెలిసికొని ధర్మముగ వారవారి కార్యములొనర్చుచుండిరి. అట్టివారిప్పుడు ప్రమాదపడుచున్నారు. అప్పుడు నేను మంత్రితో నిట్లంటిని:- ''ఈ కర్మచారులను, అధికారులను గని పెట్టి యుండుటకు వేతనమిచ్చి కొందఱ నిరీక్షకుల నియమింప వలయును.''

మంత్రి యిట్లనెను:- ''ప్రభూ! ఇది ధర్మవిరుద్ధము. ఒక సారి విశ్వాసముంచి ఒకకార్యమును వారికి ఒప్పఁజెప్పినప్పుడు వాని ననుమానించి విశ్వసింపకుండుటయు, వారిపై నొక యధికారిని నిరీక్షకునిగా నియోగించుటయు బలవంతముగఁ బ్రమాద ప్రవృత్తులఁ గావించుటయే కాఁగలదు. నరీక్షకుఁడు ప్రతిమారును వారి కార్యములను బరీక్షించుచుండిన నిరీక్షకునినుండి తప్పించు కొనుటకు వారసత్యములుపలుకుంచుందురు. ఒకప పాపమును దాఁచుటకు కనేక పాపములను జేయుచుండెదను.''

నేనిట్లంటిని:- ''ఏమైనఁ గానిండు. ఇవ్వేళ నొక ప్రమాదముకావించినవాఁడు రేపు మఱియొక ప్రమాదము చేయఁగలఁడు. కావున నిరీక్షకులను దప్పక నియమింపవలసినదే.'' నా మాటప్రకారము మంత్రి వైతనిక నిరీక్షకులను సమీక్షకొఱకు నియోగించెను. వారు కొన్ని దినములు బాగుగానేపనిచేసిరి. కాని కొన్నాళ్లైనతర్వాత నా నిరీక్షకులుగూడ ప్రమాదపడమొదలిడిరి. ఆ కారణమున నిరీక్షకుల నిరీక్షించుటకై కొందఱను నియోగింప వలసివచ్చెను. ఇట్లుజరుగుచున్నను ప్రజలు ధర్మముగనడచుటలేదు.

ఒకదినమున నొక బ్రాహ్మణుఁడు పాలు, నేయి నమ్ముటకు గాంచి వానిని బిలిచి నే నిట్లంటిని:- ''బ్రాహ్మణోత్తమా! మీరు పాపము చేయుచున్నా రేల? పాలు, నేయి, చక్కెర, నూనె మొదలగు రసవస్తువుల నమ్ముట బ్రాహ్మణులకు నిషిద్ధము. మీరీ నీచవృత్తి నేల యవలంబించితిరి?''

అతడు దీనతతోనిట్లనెను:- ''ఏమియేయుదును? ధర్మావతారా! పొట్టనిండుటలేదు. ఈ పాపపు పొట్టకొఱకేమైనఁ జేయవలసి యుండును.''

నేను ధర్మాధ్యక్షుఇనతోఁజెప్పి వానికిఁగావలసిన ద్రవ్యమునిప్పించి యిట్టిపనులు చేయవలదని నిషేధించితని. ఆతఁడట్లే చేసినాఁడు గాని యితరవర్ణముల వారిలోఁగూడ వృత్తిసాంకర్య మేర్పడినట్లు తెలియవచ్చుచున్నది.

ప్రజలలోఁ బరస్పరవ్యవహారము కుటిలతాపూర్ణముగ నున్నది. ఒకరియెడల నింకొకరికి అవిశ్వాసము. ఒకదినమున నొక కమ్మరివానివద్ద నేనొక విచిత్రయంత్రమును జూచితిని. అట్టి దానిని నేనెన్నడును జూడకపోవుటచే వానిని బిలిచి యిట్లు ప్రశ్నించితిని:- ''ఈ వస్తు వేమిటి? ఇది యేవిధముగ నుపయోగపడును?''

ఆతఁడిట్లనెను:- ప్రభూ! ఒకదినమున నేను స్నానమునకు వెళ్లితిని. అప్పుడు నా పాత్ర నెవరో తీసికొనపోయిరి. ఆ కారణమున నా బుద్ధిచే నీ యంత్రమును గనిపెట్టితిని. దీనిపేరు తాళపుబుఱ్ఱ. తలుపులకు గొళ్లెమును బెట్టి నాగవాసమునకు దానిని తగిలించి దీనిని వేసిన నింకెవరును తలుపును దెఱువలేరు దీని తాళపుచెవి నాదగ్గఱ నుండును.'' ఇది వినఁగానే నాకు చాల యాశ్చర్యమొదవి వానితో నిట్లంటిని:- ''ఇంటికి తాళము వేయుట అందఱయెడల నవిశ్వాసము కలిగింయుండుటయే. నీ వస్తువులను మేము రక్షింతుము. దానిని పగులఁగొట్టి పాఱవేయుము. ఇఁక నిట్టివి చేయకుము. ఆతఁడప్పుడే దానిని పగులఁగొట్టి పాఱవేసినాఁడు గాని యాతని మనస్సులో దీని సంస్కారము లట్లే ననిలిచిపోయినవి. ఇవ్వేళ కాకపోయిన రేపైనను మరల తయారు చేయఁగలఁడు.

ఒక దినమున నేను గంగకు వెళ్లి వచ్చుచుంటిని. ఒక రైతు తన భుజముమీఁద నాఁగేటని బెట్టుకొని యింటికి వెళ్లుచుండెను. నేను రథము నాపి వానిని బిలిచి యిట్లడిగితిని:- ''ఏమి నాయనా? నీ వింతగా శ్రమపడుచున్నా వేల? నాఁగలిని ఇంటికేలఁ గొనిపోవుచున్నావు? పొలములో నుంచిరారాదా?''

ఆతఁడు చేతులుజోడించి యిట్లనెను:- ''ధర్మావతారా! ఎప్పుడును నాఁగలి పొలములోనే యుండెదిది. రైతు యెన్నడును నాఁగలి నింటికి తెచ్చుకొనెడువాఁడు కాఁడు. కాని ఒక దినమున నా నాఁగలి కనఁబడలేదు. ఎవఁడో యెత్తుకొని పోయి నాఁడు. నేను బీదరైతును. ఆ కారణమున నేను బ్రతిదినము దీని నింటికి గొనిపోవుచున్నాను. మరల పొలమునకుఁ దీసికొన వచ్చుచున్నాను.''

అంత నాకు నా రాజ్యములోని నాతులిట్లవిశ్వాసము, చోరభయముచే నిత్యము నాఁగలినింటికిఁ దెచ్చుకొను చున్నారను దుఃఖము కలిగినది. నే నిట్లాజ్ఞాపించితిని:- ''నీ నాఁగలిని రక్షంచు భారము ప్రభుత్వముమీఁదగలదు. మీరు నాఁగలినింటికి గొనిపోవలసిన పనిలేదు.'' అంత నేను ప్రతి గ్రామ పంచాయతీకిని ఎవరైన నితరుల నాఁగలిని బట్టుకొని పోయినఁ బ్రాణదండన మిప్పింపవలయునని తాఖీదును బంపితిని. సరళముగ. బుద్ధిమంతుఁడుగనున్న రైతునకును నిట్టి వ్యవహార మారంభమయ్యెను.

ఒక దినమున నేనొక యాశ్చర్యమును గాంచితిని. ఒక మండలాధిపతియగు రాజు ఒక లోహయంత్రమున నాకాశమున నెగురుటను గాంచితిని. నేను వానినిఁ బిలిచి యిట్లంటిని:- ''నీ వే దేవత నారాధించి యీ కామగ విమానమును సంపాదించితివి?''

ఆతఁడు కొంచెము భయపడుచు లజ్ఞాభావముతో నిట్లనెను:- ''ప్రభూ! ఇది కామగ విమానము కాదు. దీనిని నారాజ్యములో నొక శిల్పి తయారుచేసినాఁడు ఇది నీరు. నిప్పు సహాయమున నావిరితో వెళ్ళును. ఏదైన స్నిగ్థపదార్థమును వేసిన దాని సహాయమున దీనిని నడిపిన నిది నదచును. సంకల్పముచే దేవతా విమానములవలె నిది పోదు.''

నే నిట్లంటిని:- ''అట్లైన నిందు నందఱును అధికారులు, ననధికారులు ఎక్కి పాపప్రచారము చేసెదరు.''

ఆతఁడు భయభీతుఁడై యిట్లనెను:- ''ధర్మావతారా! దీనిద్వారా ధర్మప్రచారము కూడ కాఁగలదు.''

నేనిట్లంటిని:- ''ధార్మికులలో నిట్టి సామర్థ్యము వారి తేజమువలన నుండును. వారు తమ యిష్టమువచ్చిన చోటకు తమ భావములను బంపఁగలుగుదురు. ఇట్టి యంత్రములను అల్ప శక్తిగల అసమర్థులు, పాపపరాయణులు, దైవీసంపత్తి లేనివారు, ప్రతికార్యమును శీఘ్రముగఁ జేయఁదలచినవారు నిర్మించుకొనుచుందురు. వానికి ప్రతికార్యము శీఘ్రముగఁ బూర్తికావలెనను దృష్టియే.'' నే నిట్లు చెప్పుచుండఁగనే వ్యాసభగవానుఁడచ్చటికి వచ్చెను.నేను లేచి విధ్యుక్తముగఁ బూజించి యీ సమస్త వృత్తాంతమును నివేదించి యిట్లడిగితని:- ''ప్రభూ! యీ మండలాధిపతి కలియుగ భావమును శీఘ్రముగాఁ బ్రచారము చేయుటకు వీలగు నీయంత్రమును నొకశిల్పిసహాయమున నిర్మించి యున్నాఁడు. వీని కేమి శిక్ష వేయవలయునో తమరు శెలవీయుఁడు'' వ్యాస భగవానుఁడు నవ్వుచు నిట్లనెను:- ''రాజా! వీని నేమియు శిక్షింపవలదు. నేను వీనికిఁ దెలియఁజెప్పెదను. నీవు దీనిని నాశముచేయుము. ఈ శిక్ష చాలును.'' నాతో నిట్లు చెప్పి వ్యాసభగవానుఁడు ఆ రాజున కిట్లనెను:- ''నాయనా! ధర్మరాజు రాజ్యమున నిట్లు చేయుట ఉచితముకాదు. నేఁటకి రెండువేల అయిదువందల సంవత్సరములైన తర్వాత బౌద్ధులనఁబడువారు కొందఱు నాస్తికులు పాలించినప్పుడిట్టి యంత్రము లనునిర్మించెదరు. వారు పాదరసముద్వారా వాటిని నడిపెదరు. అయిదువేల సంవత్సరములైన తర్వాత నివి యింటింటఁ బ్రచారమగును. ఆ సమయమున తెలపు నలుపు వర్ణముగల దస్యులేలెదరు. అప్పుడీ యంత్రములద్వారా అసత్యము, అధర్మము, కలహము ప్రచారము చేయఁబడుచుండును. వాటి కిది సమయము కాదు.'' ఇట్లు చెప్పి వ్యాసభగవానుఁడాయంత్రమును తన ముందఱనే నాశము చేయించెను.

ఆ తరువాత వ్యాసభగవానుఁడు నాతో నిట్లనెను:- ''రాజా! నీ వింక నిప్పుడేమి చూచినావు. నేఁటికి అయిదువేల సంవత్సరములైన తర్వాతఁ బ్రజలకు వర్ణాశ్రమధర్మములందు ప్రీతి యుండడు. అధ్యయనమందు గురువని శిష్యుడని యుండఁబోదు, శూద్రులు, అంత్యవర్ణస్థులు ఉచ్చవర్ణస్థుల కార్యములఁ జేయఁదొడఁగెదరు. ఉచ్చవర్ణస్థులు అంత్యజులతో సహభోజనాసనవివాహాదుల నొనర్చి, అదియే గొప్పఘనత యనుకొనెదరు. సంస్కృతి సదాచారములు క్షీణించిపోవును. సంధ్యావందనము, దేవర్షి పితృ శ్రాద్ధములు, తర్పమణములు, పూజాపారాయణలు మొదలగువాటి నన్నిటిని జూచి ఎగతాళి చేయుదురు. స్వేచ్ఛాచారమే సద్ధర్మముగ నెన్నబడును. అందఱు నన్నివృత్తుల నవలంబించి ద్రవ్యోపార్జన చేయ మొదలిడెదరు. దస్యు ధర్మముగల విదర్మీయులు రాజులగుదురు. రాజులు వ్యాపారమును సాగింతురు. స్త్రీలు లజ్జా విహినులగుదురు. కులీన స్త్రీలు ఏకవస్త్రలై సగము శరీరమును గనపఱచుచు నిర్లజ్జలై పురుషులతో బజారులోను ఉద్యాన వనములందును దిరుగుచుందురు. కన్యలుండనే యుండరు. అవివాహితలు, వివాహితలు, విధవలు ఒక్కరీతిగనే యుందురు. సౌభాగ్య చిహ్నములగు నాభూషణముల నెవరును ధరింపరు. శ్రీ, కాంతివిహీనులై, వస్త్రాభూషణరహితలై చేతులకుఁగాళ్లకు నేమియులేక విధవలవలెఁ గనఁబడుదురు. ఒకరు ఇద్దరు కారు, ఇంటింట భ్రూమహత్యలు జరుగుచుండును. కన్యకలు, విధవలు కన్నసంతాన మధికము కాఁగలదు. వారు పాపాచరమమునఁ బ్రవృత్తులగుచుందురు. కులకాంతలకును, వారకాంతలకును వేషభాషాచరణ వ్యవహారములలో భేదముండదు. దాంపత్య భావము నశించిపోవును. స్త్రీలు పురుషులవలె స్వతంత్రులై స్వేచ్ఛగ నుండవలయునని పురుషులతో ఁ బ్రతిదినమును గల హించుచుండెదరు. చాలమంది స్త్రీలుయధేష్టముగాఁ దిరుగుటకును, ప్రసవపిడనుండి తప్పించుకొనవలయుననియు గర్భకోశమును శస్త్రచికిత్సద్వారా తీసివేయుంచుకొని ఘోరమగు పాపములను జేయుచుండెదరు. "

ఇదివిని నేను చేతులతోఁ జెవులుమూసికొని యిట్లంటిని. "దేవా ! ఇట్లు చేయువారు మానవస్త్రీలా, రాక్షసస్త్రీలా?"

వ్యాసభగవానుఁ డిట్లనెను :- " వారు చూచుటకు మానవమానినుల వలెనే యుందురు. వారి యాకృతి మానవాకృతియే . చూచుటకుఁ గూడ బాగుగానే యుందురు ; కాని వాస్తవముగ వారు రాక్షసస్త్రీలై పుట్టెదరు."

నేను శ్రీకృష్ణద్వైపాయనుని పాదములంటి యిట్లంటిని :- " ప్రభూ ! ఇట్టి కాలమును నేను జూడరాదు. ఈ పాపములు నా ముందుండరాదు. నాకొక వరమీయవలెను. నేనది భగవానుని గూడ యాచించితిని. అయిదువేల సంవత్సరముల వఱకు కలియుగ మీభూమిపై నుడగిడనీయకూడదు."

వ్యాసుఁడు ప్రసన్నుఁడై యిట్లనెను :- " ధర్మరాజా ! నీవీ ఘృణిత పాపాచరమ పూర్ణమగు కార్యములను జూడవు. నా యాశీర్వచనమున నైదువేల సంవత్సరముల వఱకు కలియంతగా నుండదు. అయిదువేల సంవత్సరములైన తర్వాత కలి దాని ప్రభావమది చూపింపఁగలదు". ఇట్లని వ్యాసభగవానుఁడు వెళ్లిపోయెను.

నిన్న నే నొక యాశ్చర్యమును గాంచితిని. ఒక కులీన స్త్రీ ఏకవస్త్రముతో నర్ధనగ్నమై, నిర్లజ్జయై అందఱ యెదుట నవ్వుచు బజారునఁ బోవుచుండెను. నన్ను జూచియు సిగ్గుపడలేదు. నేను రాజభవనమునకు వచ్చునప్పటికి - ఒక స్త్రీ, మంచి చక్కని వస్త్రాభూషణములను ధరించి యనేక సుగంధ ద్రవ్యములను రాచుకొని నులుచుండెను. నన్నుఁజూచి ఆమె కొంచెము లజ్జతయై తొలగెను. ఆమె యెవరని నేను మావృద్ధ దాసీ నడిగితిని. 'ఈమె దుర్యోధనుని ఆఖరు తమ్ముని భార్య' యని యామె చెప్పెను. ఇది వినఁగానే నాపై నేదో పిడుగు పడినట్లుండెను. కలియుగము నారాజ్యములోనే కాదు ప్రవేశించినది, నాయింటిలోఁగూడ ప్రవేశించినదని గ్రహించితిని. ఇఁక నీలోకములో నుండవీలులేదు. మాకేదియో యనిష్టము సంభవింపనున్నది. నిన్న నేడుఁ నే ననేకములగు అపశకునములను గాంచుచున్నాను. వాటి నన్నిటిని ముందు మీ కందఱకు చెప్పెదను."

ఇంకొక విషయము కూడ జరిగినట్లు నాకు తోచుచున్నది. శ్రీకృష్ణ భగవానుఁడు ఈభూమిని వదలి పోయినాఁడో, పోనున్నాడో, అందుకనియే కలికాల మింతగా భూమిమీఁద వ్యాపించినది.

(2)

సూతుఁడిట్లనెను :- మునులారా ! అర్జునుఁడు రాకపోవునప్పటికి ధర్మరాజు భీమసేనునితోను, ఇతర తమ్ములతోను ఇట్లనెను :- " అర్జునుఁడు రాని కారణము నాకు తోఁచుటలేదు, ఇఁక నిచ్చట కలికాలము తన యధికారమును సర్వత్ర వ్యాపింపఁజేసికొనినట్లు తోఁచుచున్నది. ఇది కలిశాసన కాలము కావున మనమిక నిచ్చట నుండరాదు. కలియుగ చిహ్నములన్నియు ఁ బ్రత్యక్షముగఁ గనఁబడుచున్నవి. ఒకదినమున కలి నాదగ్గఱకు వచ్చి 'ఇది నారాజ్యకాలము, మీరిఁక సింహాసనమును వీడవలయు'నని చెప్పుకొనెను.

అంతఁ గుతూహలవశమున నొక యాత్మీయుఁడిట్లనెను :- " దేవా ! మీరు ధర్మావతారులు. కలికిని మీకును సమావేశ##మెక్కడ ? మీ యెదుటకు వచ్చునంతటి సాహసము కలి కెట్లు కలిగినది ?"

ఈ ప్రశ్నను విని అందఱు వినునట్లు ధర్మరాజిట్లనెను :- " సోదరులారా ! ఒక దినమున నాతమ్ములగు భీమార్జున నకుల సహదేవులు నలుగు రొక్కసారిగ సభలోనికి వచ్చుచుండిరి. అప్పుడు వీరు సభా ద్వారమున నొక్కని గారించిరి. ఆతని వద్ద సర్వలక్షణ సంపన్నమును, మిక్కిలి వేగముగఁ బరువిడఁగల నొక సుందరాశ్వము కలదు. ఆ యద్వియాశ్వమును గాంచి నాసోదరులచ్చటకు వెళ్లి 'గుఱ్ఱము నమ్మెదవా' యనిరి.

ఆతఁడు వినయముతో నిట్లనెను :- " మహారాజా ! నేను దీనినమ్ముటకే తెచ్చితిని"

అప్పుడు నాతమ్ములు సంతోషముతో నిట్లనిరి :- " మంచిది. అయితే నీవు దీనిని నా యశ్వశాలలో ఁ గట్టివేసి వచ్చి నీ కెన్నిరూపాయలు కావలయునో అన్నిటిని గొనిపొమ్ము."

ఆవ్యక్తి యిట్లనెను :- " మహారాజకుమారులారా ! మీవద్ద ధనమునకు కొదువలేదు. నాకును ధనేచ్ఛలేదు. మీకు నేను నాలుగు ప్రశ్నలిచ్చెదను. వాటికి మీరు సదుత్తరము లిచ్చిన గుఱ్ఱము మీది. నేను దాని నశ్వశాలలోఁగట్టివేసెదను. మీరు సరియైనజవాబులు చెప్పలేకపోయితిరా, నేనొక గీటు గీసెదను. నా ప్రశ్నలకు సరియగు జవాబు లభించువఱకు మీరు ధర్మము ననుసరించి ఆ గీటు దాఁటఁగూడదు." సాధారణముగ గుఱ్ఱముల నమ్ముకొనువాని యిట్టి మాటలను విని నాసోదరులకు కుతూహలము కలిగి వారు నవ్వుచు నిట్లనిరి :- " సరే ! నీ నియమము మా కంగీకారమే."

ఇదివిని యాతఁ డానంతముతో నిట్లనెను :- " నేను నా యశ్వమును దీసికొనివచ్చునప్పుడు దారిలో నొక భయంకరమగు బావిని జూచితిని. అచ్చట నొక విచిత్ర విషయమొకటి కనఁబడినది. ఆ కూప ముఖమున ఒక కానీ వేలాడఁగట్టఁబడి యుండెను. ఆకానీకి లక్షలమణగుల బరువుగల యినుపగుండు వ్రేలాడఁగట్టఁ బడెను. అయినను అది బావిలో ఁ బడలేదు. దాని కారణమేమి ?"

నాతమ్ములు నలుగురు ఒకరి ముఖము లొకరు చూచుకొనిరి. ఎవరికిని దీనికి ప్రత్యుత్తరము తోఁచలేదు. అప్పుడాతఁడు వినయముతో నిట్లనెను :- " మీ నల్గురన్నదమ్ములలో ఒకరు మన పందెము కొఱకు ఈగీతలో నిలుచుండవలెను". ఇది విని భీముఁడు ఆ ధర్మరేఖ లోపల నిలుచుండెను. అంత నాతఁడు రెండవ ప్రశ్నను వేసెను :- " ఒకదినమున నేను మార్గమున వచ్చుచుంటిని. దారిలో నేనైదు బావులను జూచితిని. నాలుగు బావు లచ్చటచ్చట నున్నవి. ఒక బావిమాత్రము మధ్యలోఁ గలదు. ఆ యైదు బావులలోని నీరు ఉడుకుచుండును. దగ్గఱలో నున్న బావి పట్టుపడినపుడు మధ్యబావిలోని నీరుడికి దానిని నింపును. కాని మధ్యబావి వట్టుపడినపుడు దానిని మిగిలిన నాలుగు బావులు నింపలేవు. కారణమేమి ?"

నాతమ్ములు ముగ్గురులో నెవరికిని దీనికి సమాధానము కుదురలేదు. అంత నర్జునుఁడాధర్మరేఖలో ఁ బోయినిలుచుండెను. అంత నాతఁడు మూఁడవప్రశ్న వేసెను. ఆతఁడిట్లనెను :- " ఒక దినమున నేను దారిలో నొకవింతను గాంచితిని. ఒక ఆవు దూడ నీనినది. పుట్టఁగానే దూడ ఆవు పాలు త్రాగవలసినది పోయి ఆవు దూడ పాలు త్రాగుచుండెను."

ఇది విని నకులసహదేవులు ఒకరిముఖము నొకరు చూచుకొని యీతఁ డద్భుతములో నద్భుతప్రశ్న లడుగుచున్నాఁéడే యనుకొనిరి. వారికి సమాధానము దొరకకపోవుటచే నకులుఁడా ధర్మరేఖలోనికిఁ బోయెను. అంత నాతఁడు నాల్గవప్రశ్న నడిగెను.

ఆతఁడిట్లనెను :- " ఒక దినమున నేను దారిని వచ్చు చుండఁగా నొక జంతువు నా యెట్టయెదుట కనఁబడెను. అది చాలసారులు నోటితోఁ జెడ్డశబ్దములు పలుకుచు ముడ్డితో గడ్డి తినుచున్నది. ఇది యేది ?"

సహదేవునకు దీనికి జవాబు దొరకలేదు. అందువలన నాతఁడు కూడ ధర్మపరిథి లోనికిఁబోయి నిలుచుండెను.

నేను చాలసేపు నిరీక్షించితిని. నలుగురిలో నొక్కరును ఇంతవఱకు రాలేదేలనని నేను సేవకునిఁ బంపఁగా సేవకుఁడు వచ్చి యిట్లనెను :- " మహారాజా ! ఒక గుఱ్ఱపువాఁడు ద్వారమున నిలుచున్నాఁడు వాని దగ్గఱ నలుగురును నిలుచుండిరి. లోపలకు రానేరారు."

నాకును గుతూహలము కలిగి బయటకు వచ్చితిని. నే నిట్లనుకొంటిని :- ' వీరికి గుఱ్ఱము నచ్చి కావలెననుకొనుచున్నారు. ఈతఁడీయఁడు, బేరము చెప్పఁడేల ?' అనుకొని నేనిట్లంటిని :- " అబ్బాయీ ! నీవు గుఱ్ఱమును అమ్మవాయేమి ?

ఆతఁడిట్లనెను :- ' అన్నదాతా ! నేనమ్ముటకే వచ్చితిని'. నేనిట్లంటిని :- " అయితే, నా సోదరులిట్లెందులకు నిలుచుండిరి ? దీనిని అశ్వశాలలోఁగట్టివేయుము. నీకు కావలసిన హూప్యములఁ గొనిపొమ్ము."

ఆతఁడిట్లనెను :- " అన్నదాతా ! మీవద్ద ధనమునకుఁ గొదువేమి ? ఈ మాటను మీతమ్ములు కూడ చెప్పిరి. కాని ధనావశ్యకత నాకుగూడ లేదు. మీరు నాకు నాలుగు ప్రశ్నలకు జవాబీయుఁడు. ఈ గుఱ్ఱమును దీసికొనిపోయి అశ్వశాలలో బంధించెదను."

ధర్మరా జిట్లనెను :- " అడుగు నాయనా ! నీ ప్రశ్న లేమిటో ? ఆతఁడా మొదటి ప్రశ్న నడిగెను. అగాధ కూపమందు కానీ యధారమున లక్షలమణుఁగుల బరువుగల లోహము వ్రేలాడుచున్నది. ఇదియేమిటి?"

నేను వానిని గద్దించుచు నిట్లంటిని :- " నీవు వట్టి ధూర్తునివలెఁ గనఁబడుచున్నావే. మారాజ్యములో నీవు కలియుగ విషయములు పలుకుచున్నావు. ఇట్టివి కలియుగములో జరుగఁగలవు. కలియుగములో ధర్మకర్మము లుండవు. ఎవడైన దయావశమున నొక్క పిడికెడన్న మెవరికైన దానముచేసెనా ఆకానీ దానము మూలకముగా లక్షమణుఁగుల ఇనుమును బోలు అధర్మమును వ్రేలాడఁగట్టుకొనును. దయాదానములను రెంటిని వదలిపెట్టినవారు ఆ లోహముతో సంసారరూపమగు మోహకూపములో ఁబడిపోవుదురు".

ఇది విని యావ్యక్తి యిట్లడిగెను :- " మహారాజా ! మధ్యలోనున్న నొక కూపము చుట్టునున్న నాలుగు ఖాలీ కూపములను నింపును, గాని మధ్యకూపము ఖాళీయైన నా ఒక్కకూపమును నీనాల్గుకూపములు కలిసియు నింపలేవు. ఇదియేమి ?"

నేనుత్తేజితుఁడనై యిట్లంటిని :- " నీవు గొప్ప అధర్మ బంధుఁడవు. ధూర్తుఁడవు ? ఇంకను గలియుగమునకు సంబంధించిన వాక్కులే నోట వెలువడుచున్నవి. ఇట్టివి కలియుగములో జరుగును. తండ్రికి నలుగురు కొడుకులుండిన వారిని నలుగురుని పెంచి పెద్దవారిని గావించును. విద్యాబుద్ధులు చెప్పించును. యోగ్యుల నొనర్చును. కాని తండ్రికి వృద్ధాప్యము రాఁగానే కలియుగములో %ీనలుగురును వానిని పోషింపరు. తల్లితండ్రులు కడుపుమాడి చావవలసినదే. లేదా అనాథాలయము నాశ్రయించవలెను. లేక ఆఁకటఁజావనైనఁ జావవలయును."

ఇది విని ఆవ్యక్తి యిట్లనెను :- " మహారాజా ! గోక్షీర ముల వత్సము త్రాగవలయును. గోవు దూడపాల నేత త్రాగుచున్నది?"

నేను వానిని గద్దించుచు నిట్లంటిని :- " జాగ్రత్త ! చాల ముదిరినది. నీవు సాక్షాత్తుగ కలియుగమువలె నున్నావు. ఓరీ! ధూర్తుఁడా ! ఇట్టిపనిని కలియుగములోని తండ్రి చేయవలయునురా! ఆఁడపిల్ల పుట్టెనా, దాని సహామున నప్పుచేయును. బాగుగా తినుచుండును. అది కొంచెము పెద్దదికాఁగానే దాని నమ్మివేయును. అంత మఱియొకపిల్లపేరట నప్పుచేయును. ఇట్టి కన్యావిక్రయముచేయు నీచులు, అధములు, పాపులు, రాక్షసులు అగు తండ్రులు కలి కాలమునఁ జాలమంది పుట్టఁగలరు. ఇట్లమ్మఁ బడిన దానికి పుట్టినబిడ్డలు జరిపిన పిండదానాదులు వారి పితరులకుఁ జెందవు. కన్యక నమ్మువాఁడును, కన్యాద్రవ్యముచే జీవించువాఁడును ఘోరపాపులు. ఇట్టి పాపులముఖమును జూచినను పాపమే. కలియుగములో నిట్టి పాపు లనేకు లుండఁగలరు."

ఇది విని యాతఁడిట్లడిగెను :- " మహారాజా ! భయంకర మగు చెడ్డశబ్దములు చేయుచు , ముడ్డితో గడ్డితిను జంతువేది ?"

ఇది వినఁగానే నాకుమిక్కిలి కోపమువచ్చి ఖడ్గమునుదూసి యిట్లంటిని :- " నీవు కపటవేషముతో వచ్చిన కలియుగమని నే నిప్పుడు నిశ్చయముగ గ్రహించితిని. అరేనీచా! వేదశాస్త్రములను వదలి, ఇతిహాస పురాణాశ్రయమును వీడి, తనకిష్టము వచ్చిన కపట కల్పితము లై తలతోకలేని రచనలు చేయుచు డబ్బుకై గడ్డితిను కవులు కలియుగములో నుండఁగలరు. వారనుకూలమార్గములను వదలి ప్రతికూల మార్గముల నాశ్రయించెదరు. నోటఁదినక ముడ్డిని దిందురు. నేను నీప్రశ్నల నాల్గింటికి జవాబిచ్చితిని. నీవెవఁడవో యిప్పుడు నాకు నిజముగఁ జెప్పుము. లేకున్న నిప్పుడే నీతల తీసివేసెదను ".

ఇదివిని నాతఁడిట్లనెను :- " ప్రభూ ! వాస్తవముగ నేను గలియుగమునే. ఇప్పుడు నాకు రాజ్యసమయ మాసన్నమైనది. కాని సాక్షాత్తుగా ధర్మావతారులగు మీరు చక్రవర్తులగునంత వఱకు నాకు గతిలేదు, నా కధికారములేదు, నేనడుగునది లేదు. మీరు ధర్మాత్ములరు. ఇతరులభాగమును హరింపగోరరు. కావున నిప్పుడు సింహాసనము నాకు లభింపవలెను. ఇఁక నాసామ్రాజ్యము సాగవలయును."

ఇది విని నేను నవ్వుచు నిట్లంటిని :- " అరే ! ధూర్తా ! నీ వధర్మమిత్రుఁడవని నేనిదివఱకే తెలిసికొంటిని. ఇది నీ రాజ్యకాలమని నాకు తెలియును. కాని ఆనందకందుఁడగు దేవకీనందన శ్రికృష్ణచంద్రుఁడీ యవనీమండలమున నుండువఱకు నేను సింహాసనమును వదలను. ఆతఁడు స్వధామమునకుఁ జేరినప్పుడు నేను గూడ హిమాలయమునకుఁ బోయెదను. అప్పుడు నీ యిష్టమువచ్చినట్లు చేసికొనవచ్చును. శ్రీకృష్ణుడుండఁగా నీవు నా రాజ్యములో నుండవలెననియు ననుకొనఁగూడదు." నాయీ మాటను విని కలియుగము ప్రసన్నుఁడై వెళ్లిపోయెను.

కావున సోదరులారా ! నేఁడావిషయములన్నియుఁ బ్రత్యక్షముగఁ గనఁబడుచున్నవి. దీనిని బట్టి విశ్వనాథుఁ డి విశ్వమును విధవనుజేసి స్వధామమునకుఁ జేరెనని తోఁచుచున్నది. శ్రీకృష్మరహితమై, కలియుగాక్రాంతమైన నీ యవనియందిఁక మనముండఁజనదు. ఇఁక మనము హిమాలయమునకు వెళ్లుదము.

ఇట్లు చెప్పుచు ధర్మరా జత్యంత చింతాకులుఁడై అశ్రువుల రాల్చెను. ఆతని ముఖమండలము వాడిపోయెను. ఆతఁ డత్యంత విషాదయుక్తుఁడై దీర్ఘ నిశ్వ్శాసములు విడుచుండెను.

ఛ ప్ప య

త్యాగో సబనే ధర్మ కర్మ కఛు కరేఁ న హితకర |

పాలేఁ పాపీ పేట పాప కరి సభీ నారి నర ||

కరేఁ నహీఁ విశ్వాస్‌ పరస్పర ప్రేమ న రాఖేఁ |

తనిక ద్రవ్యకే హేతు హాల మిథ్యా సబ్‌ బాఖేఁ ||

నిరఖ నిత్య ఉతపాత అతి, మన మలీన మేరో భయో |

కపట బంధు కలికాల కా, ధరాధామ పై ఛా గయో ||

అర్థము

అందఱును ధర్మకర్మములను వదలిరి. హితకర మగు ప్రయత్న మెవరును జేయుటలేదు. స్త్రీ పురుషు లందఱును పాపమును జేయుచుఁ బాపపోషణము చేయుచుండిరి. ఒకరినిఁజూచి నొకరికి విశ్వాసములేదు. ఒకరిమీఁద నొకరికి ప్రేమలేదు. అల్ప ద్రవ్యముకొఱకై మిథ్యాభాషణములెన్నియో ఆడుచుండుదురు.

ప్రతిదినము కనఁబడు ఉత్పాతములను జూచిన నామనస్సు మలినమైనది. కలికి సంబంధించిన కపటబంధువులు భూమి యంతటను నిండిపోయిరి.

BHAGAVATA KADHA-3    Chapters